
పర్వతగిరి, వెలుగు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు తిరిగి రాగా.. అంతలోనే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్రూరల్జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లికి చెందిన మంత్రి నాగరాజుకు తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు, కొడుకు ఉన్నారు. కాగా ఏపీలోని తిరుపతికి చెందిన పైడి రాజశేఖర్ప్రేమ పేరుతో బాలికను ట్రాప్చేశాడు. అతని మాటలు విన్న బాలిక ఈ నెల 7వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో 8వ తేదీన నాగరాజు పర్వతగిరి పోలీసులకు కంప్లైంట్చేశాడు. అప్పటి నుంచి మనస్తాపం చెందిన నాగరాజు 16న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఫేస్ బుక్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక తిరుపతిలోని రాజశేఖర్వద్ద ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి బుధవారం పర్వతగిరి తీసుకొచ్చారు. బాలికను చైల్డ్‌హోంకు తరలించినట్లు మామునూర్ ఏసీపీ నరేశ్‌కుమార్ తెలిపారు.