
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది.పలమనేరులో సంచరి స్తూ.. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒంటరి ఏనుగు దాడిలో గాయపడిన అటివీశాఖ అధికారి సుకుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జనాలను భయ భ్రాంతులకు గురి చేస్తుంది.
జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. జన నివాసాల వద్దకు ఒంటరి ఏనుగు రావడంతో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఒంటరి ఏనుగు వద్దకు ప్రజలు వెళ్లరాదని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అటవీశాఖాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగునుఅటవీమార్గానికి మళ్లించలేకపోతున్నారు. కుంకీ ఏనుగుల సహాయంతో ఒంటరి ఏనుగును దారిమళ్లించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే స్థానికులు రాత్రి సమయంలో బయట తిరగొద్దని అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు