
మీరు రిటైర్ అయ్యారా... ఏదైనా పెట్టుబడి ద్వారా బెస్ట్ వడ్డీ కావాలా... అయితే మంచి పెట్టుబడి అవకాశాల కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లు ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు)పై 8.4% వరకు వడ్డీ పొందొచ్చు. ఈ వడ్డీ రేట్లు 5 ఏళ్ల కాలానికి రూ. 3 కోట్ల వరకు డిపాజిట్లపై ఉన్నాయి. తక్కువ రిస్క్‌తో రెగ్యులర్ ఆదాయం కోరుకునే రిటైర్ అయిన వారికి ఇదొక చాలా బెస్ట్ అప్షన్.
ప్రస్తుతం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks) అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. అయితే పెట్టుబడిదారులు DICGC (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) పథకం కింద ఉన్న భద్రత & కవరేజ్ లిమిట్ గుర్తుంచుకోవాలి.
24 సెప్టెంబర్ 2025 నాటికి సీనియర్ సిటిజన్ల కోసం టాప్ FD వడ్డీ రేట్లు చూస్తే:
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ట FD వడ్డీ రేటు 8.4%, పదవీకాలం 5 సంవత్సరాలు
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ట FD వడ్డీ రేటు 8%, పదవీకాలం 5 సంవత్సరాలు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ట FD వడ్డీ రేటు 7.75%, పదవీకాలం3 సంవత్సరాలు
DICGC భీమా (Insurance) & భద్రత
ఈ వడ్డీ రేట్లు పెద్ద వాణిజ్య బ్యాంకులు (Commercial Banks) ఇచ్చే వాటి కంటే చాలా ఎక్కువగా ఉన్న కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అన్ని బ్యాంకుల డిపాజిట్లు చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో సహా DICGC కింద రూ. 5 లక్షల వరకు (అసలు + వడ్డీ) ఇన్సూరెన్స్ చేయబడతాయి. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండాలంటే ప్రతి బ్యాంకులో ఈ పరిమితి (రూ. 5 లక్షలు) మించకుండా పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై TDS రూల్స్ : ఒక సీనియర్ సిటిజన్ ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించే FD వడ్డీ రూ. 50 వేలు దాటితే, బ్యాంకులు TDS (Tax Deducted at Source)కట్ చేయాలి. TDS అనేది అదనపు పన్ను కాదు, కేవలం ముందుగానే పన్ను కట్ చేయడం మాత్రమే. మీరు ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) ఫైల్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కట్టాల్సిన పన్ను తక్కువగా ఉంటే, కట్ చేసిన మొత్తాన్ని రిఫండ్ (Refund) తీసుకోవచ్చు.
ఫామ్ 15H: పన్ను కట్టాల్సిన ఆదాయం కనీస పరిమితి కంటే తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లు, అనవసరంగా TDS కట్ కాకుండా ఉండటానికి బ్యాంకుకు ఫామ్ 15Hను సబ్మిట్ చేయాలి.
సీనియర్ సిటిజన్లకు పన్ను ప్రయోజనాలు:
*కొత్త పన్ను విధానం ప్రకారం (FY 2025-26): సెక్షన్ 87A రిబేట్ ఉపయోగించుకుంటే రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు.
*పాత పన్ను విధానం ప్రకారం: రిబేట్ తర్వాత రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు.
*మీ ఆదాయం ఈ పరిమితుల లోపల ఉన్నా, మీరు ఫామ్ 15H సమర్పించకపోతే, FD వడ్డీ రూ. 50 వేలు దాటితే బ్యాంకులు తప్పనిసరిగా TDS కట్ చేయాల్సి ఉంటుంది.
సీనియర్లకు FDలు ఎందుకు బెస్ట్
*గ్యారెంటీ రాబడి: మార్కెట్ మార్పులతో సంబంధం లేకుండా వడ్డీ స్థిరంగా ఉంటుంది.
*రెగ్యులర్ ఆదాయం: ప్రతినెల లేదా 3 నెలలకు వడ్డీ చెల్లింపులు రిటైర్ అయిన వారికి ఇంటి ఖర్చుల కోసం ఉపయోగపడతాయి.
*తక్కువ రిస్క్: ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల కంటే సురక్షితమైనవి. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇది బెస్ట్.
*సౌలభ్యం: నెలల నుండి 10 సంవత్సరాల వరకు వివిధ రకాల అప్షన్స్ ఉన్నాయి.