ఉత్తర ప్రదేశ్లో వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఉత్తర ప్రదేశ్లో వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు..

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వర్మ ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించగా.. 'ద్రౌపది రాష్ట్రపతి ' అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ వ్యాఖ్యలు చేశారు వర్మ. దీంతో వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై బీజేపీ నేతలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మపై ఉత్తర ప్రదేశ్ లోని హజ్రత్‌ గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.