ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తుంది. ఈ ఏడాది కొత్త గాడ్జెట్‌లు, ఇంటి సామాన్లు కొనుక్కోవడానికి లేదా అవసరమైనవి షాపింగ్ చేయడానికి ఇదే మంచి ఛాన్స్.
ఈ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 16 దీని ధర ప్రస్తుతం రూ.56,999గా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ.69,999. Samsung లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా ఆఫర్స్ ఉన్నాయి. గెలాక్సీ S24 (స్నాప్‌డ్రాగన్ ఎడిషన్) ధర రూ.40,999, గెలాక్సీ S24 FE ధర రూ.31,999. Vivo సెలెక్ట్ చేసిన 5G ఫోన్‌లను డిస్కౌంట్స్ ధరకే ఇస్తుంది. వివో T4 అల్ట్రా 5G ధర రూ.34,999, వివో V60 5G ధర రూ.36,999,
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద బ్రాండ్ల ప్రీమియం, మిడ్ రేంజ్ డివైజెస్లపై మంచి డీల్స్ అందిస్తుంది.
Also read:- షాపింగ్ లవర్స్‌కి AI స్పెషల్.. ఈకామర్స్ షాపింగ్ కోసం ChatGPT రీసెర్చ్ టూల్
ల్యాప్‌టాప్‌లు/కంప్యూటర్ల పై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. స్టూడెంట్లు, ఉద్యోగులు, గేమర్లు కొత్త సిస్టమ్ కొనడానికి ఇది సరైన సమయం అని చెప్పొచ్చు. టీవీలు, సౌండ్‌బార్స్: సౌండ్ సిస్టమ్స్ వంటి ఎంటర్టైన్మెంట్ వస్తువులు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి.
ఎలక్ట్రానిక్స్‌తో పాటు, ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులపై కూడా అదిరిపోయే అఫర్ ధరకే ఉన్నాయి. వీటిలో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు, మైక్రోవేవ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు వంటి వాటిపై మంచి డిస్కౌంట్ ఉంది. చలికాలం వస్తోంది కాబట్టి, రూమ్ హీటర్లు, గీజర్లు, ఎలక్ట్రిక్ దుప్పట్లు వంటి వాటిపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంటి అలంకరణ వస్తువులపై కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంది.
ఈ సేల్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్, EMI వంటి అన్ని రకాల పేమెంట్స్ పద్ధతులకి ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ సేల్ ద్వారా ఎక్కువ లాభం పొందాలంటే కొనాలనుకున్న వస్తువులను ముందే మీ కార్ట్‌లోకి యాడ్ చేసుకోండి. కేవలం డిస్కౌంట్ చూసి కాకుండా వస్తువుల స్పెసిఫికేషన్స్ పోల్చి చుడండి. వారంటీ, ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీల ఉందొ లేదో కూడా చుడండి. కొన్ని డీల్స్ తక్కువ సేపు మాత్రమే ఉంటాయి వాటి పై కూడా ఒక లుక్ వేయండి.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 అనేది బెస్ట్ డీల్స్, ఎల్ట్రోనిక్ వస్తువుల పై డిస్కౌంట్స్, ఆఫర్స్, మీరు ఫోన్ మార్చాలనుకున్నా లేదా ఇంటికి అవసరమైనవి కొనుక్కోవాలనుకున్నా తెలివిగా షాపింగ్ చేసి డబ్బు ఆదా చేసుకోవడానికి ఈ సేల్ ఒక మంచి అవకాశం ఇస్తుంది.
