హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝళిపిస్తున్నారు. 2024 జూన్ 17వ తేదీ సోమవారం రోజున మాదాపూర్ లోని నారాయణ సొసైటీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. దోశ ఫ్యాన్ అపరిశుభ్రంగా చిలుము పట్టి ఉండడాన్ని గమనించారు అధికారులు.
ఆహార పదార్థాలను గ్రైండింగ్ చేసే ఏరియాలో ఇతర పదార్థాలు కలిసే విధంగా అక్కడ పరిస్థితి ఉంది. వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు అధికారలు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్ల అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు.ప్రతిఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హెచ్చరించారు.
???????? ???????, ?? ??. ??/??, ????????
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 17, 2024
* Expired white gravy (2kg), chopp masala (2kg) found.
* No FOSTAC supervisor among the staff.
* Dosa pan found to be unhygienic and rusted.
* Observed multiple hygiene issues in the kitchen area.
*… pic.twitter.com/lcqSPp7Q9X
ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. షార్ట్టర్మ్లో గ్యాస్ట్రిక్సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల కేన్సర్ వచ్చే ముప్పు ఉందని అంటున్నారు. స్టోర్ చేసిన ఫుడ్‌ను తిరిగి వేడి చేయడం ద్వారా అందులో ఫామ్ అయిన బ్యాక్టీరియా చనిపోయి విష పదార్థాలను విడుదల చేస్తుందని, అది తింటే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు డయేరియా వస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
