మోదీతో అమరీందర్ భేటీ

మోదీతో అమరీందర్ భేటీ

రైతుల సమస్యలపై చర్చించిన బీజేపీ నేత

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. రైతుల సమస్యలపై ప్రధానితో చర్చించినట్టు అమరీందర్ సింగ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. “ప్రధాని మోదీతో సమావేశమయ్యాను. పంజాబ్​కు సంబంధిం చిన సమస్యలు, రైతులు చేపడుతోన్న నిరస నలపై విస్తృత చర్చలు జరిపాను” అని అమరీం దర్ సింగ్ తెలిపారు. అందరికీ సంతృప్తికర పరిష్కారం త్వరలోనే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కూతురు, బీజేపీ పంజాబ్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ జై ఇందర్ కౌర్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. అంతకుముందు సోమవారం రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) కు కొంటాయని, ఇందుకు ఐదేండ్ల ఒప్పందాన్ని ప్రతిపాదించ గా.. రైతుల సంఘాలు తిరస్కరించాయి.