
బోధన్, వెలుగు : మండలంలోని కల్దుర్కి, సాలూర మండలంలోని సాలంపాడ్, మందర్నా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శీల శంకర్ భూమి పూజ చేశారు. సాలూర, బోధన్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు మందర్నా రవి, నాగేశ్వరరావు, సాలూర ఎంపీడీవో శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణ, ఏఈ శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ రాధిక పాల్గొన్నారు.
రామడుగు, కేశారం, బేల్యాతండా గ్రామాల్లో..
ధర్పల్లి, వెలుగు: రామడుగు, కేశారం, బేల్యాతండా గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్‌రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.2 లక్షలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ.12 లక్షలు అంగన్‌వాడీ భవనాల కోసం కేటాయించినట్లు తెలిపారు.
బేల్యాతండాలో పాఠశాల ప్రహరీకి రూ.15 లక్షలు, రామడుగు పాఠశాలలో మరుగుదొడ్లకు రూ.4 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తహసీల్దార్శాంత, పీఆర్ ఏఈ బాలాజీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెలిమెల శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.
మల్లారం, జోర్‌పూర్ గ్రామాల్లో..
నందిపేట, వెలుగు: మండలంలోని మల్లారం, జోర్‌పూర్ గ్రామాల్లో శుక్రవారం పనుల జాతర నిర్వహించారు. నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. గ్రామ కమిటీ సభ్యులు నర్సింహ, శ్రీను, రఫీక్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
మోస్రా మండలంలో..
వర్ని, వెలుగు : మోస్రా మండలంలోని తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీవో పద్మ ప్రారంభించి మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.12 లక్షల వ్యయంతో భవనం నిర్మించామని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమలత, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మీ, పుష్పలత, కరుణ, మీనా, సురేఖ తదితరులు పాల్గొన్నారు.