పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ.. నలుగురు పోలీసుల మృతి

 పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ.. నలుగురు పోలీసుల మృతి

శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం రంగోయి సున్నా దేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ. ఆర్. పోలీస్ ఎచ్చెర్ల కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. రోడ్డు క్రాస్‌ చేస్తున్న పోలీసుల బొలెరో వాహనాన్ని లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం నుజ్జు నుజ్జు అయింది.  డ్యూటీలో భాగాం వెళ్తున్న నలుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లు స్పాట్ లో చనిపోయారు. బైరిసారంగపురంలో జవాను మృతదేహాన్ని అప్పగించి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.