స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి : మంత్రి గడ్డం వివేక్

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి : మంత్రి గడ్డం వివేక్
  • జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ 

సిద్దిపేట, వెలుగు: స్థానిక ఎన్నికల్లో  సత్తా చాటాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్  వెంకటస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలిచేలా నాయకులు కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పదేళ్ల కేసీఆర్​పాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని  వివరించాలన్నారు. 

ఓ వైపు అప్పులు తీరుస్తూ మరో వైపు  తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 

మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని, వారి  మాటలు నమ్మి మోసపోవద్దని  ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్,  నాయకులు మహేందర్ రావు, లక్ష్మి, యాదగిరి, సతీశ్ గౌడ్, కౌన్సిలర్ సాకి ఆనంద్, ఎల్లం, రియాజుద్దీన్,  కలిముద్దీన్, యాదగిరి పాల్గొన్నారు.