
ఆన్ లైన్ గేమ్స్ ఉంటాయి.. డబ్బులతో మాత్రం ఆడకూడదు.. ఉత్తినే.. ఊరికే ఆడాలి.. అవును ఇండియాలో ఇక నుంచి ఆన్ లైన్ గేమ్స్ ను డబ్బులు పెడితే ఆడితే తాటతీస్తారు.. జైల్లో వేస్తారు.. కోట్ల రూపాయల ఫైన్ వేస్తారు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఇప్పుడు ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీని మటాష్ చేస్తుంది.. ఇంతకీ ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్స్ ఎంతో తెలుసా.. అక్షరాల 32 వేల కోట్ల రూపాయలు.. అవును.. ప్రతి ఏటా మన భారతీయులు.. మనోళ్లు ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు పెట్టి ఆడే ఆటల విలువ అక్షరాల 32 వేల కోట్ల రూపాయలు.. ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది..
అయితే కేంద్ర మంత్రివర్గం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ బిల్లు 2025కు ఆమోదం పలికింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై ఇప్పటివరకు తీసుకున్న అతికఠినమైన చర్యలలో ఇది హైలెట్ గా నిలుస్తుంది.
ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే డబ్బు పెట్టి ఆడే అన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధం విధిస్తారు. అలాగే ఇలాంటి సైట్స్, యాప్స్ ని ప్రోత్సహించే యాడ్స్ పై నిషేధం విధిస్తారు. ఇంకా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా నిషేధిస్తాయి. బిల్లు ప్రకారం ఇలాంటి గేమ్‌లను నిర్వహించే వారికీ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానాలు విధిస్తుంది.
Dream11, Games24x7, Winzo, GamesKraft, 99Games, KheloFantasy, My11Circle వంటి ఫెమస్ సైట్లు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ ప్రస్తుతం 370 కోట్లుగా ఉంది కానీ 2029 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 910 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కానీ ప్రస్తుతం ఉన్న ఆదాయంలో దాదాపు 86% రియల్-మనీ ఫార్మాట్‌ల నుండి వస్తుంది. ఇదంతా ఇప్పుడు తుడిచిపెట్టుకొనిపోయి పరిశ్రమ ఆర్థిక జీవనాడి రాత్రికి రాత్రే అదృశ్యమవుతుంది.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుపై వెంటనే జోక్యం తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది, అలాగే ఒక్కసారిగా పూర్తి నిషేధం విధిస్తే ఈ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది .
ఈ బిల్లు మంచి కంటే హాని ఎక్కువ చేస్తుందని, లక్షల ఉద్యోగాలను తుడిచిపెడుతుందని ఇంకా ఆన్ లైన్ గేమర్లను అక్రమ జూదం/ గేమ్స్ వైపు మళ్లిస్తుందని దీని వల్ల ఆర్థిక వృద్ధి కూడా దెబ్బతీస్తుందని తెలిపింది.
బిల్లులో ఎం ఉందంటే : అన్ని రియల్-మనీ గేమింగ్ లావాదేవీలపై, బ్యాంకులు ఇంకా పేమెంట్ గేట్‌వేలు డబ్బులను ప్రాసెస్ చేయకుండా నిషేధం, వీటికి సంబంధించిన యాడ్స్ కూడా చట్టవిరుద్ధం కాబట్టి పూర్తి నిషేధాన్ని ప్రతిపాదిస్తుంది.
ఆన్ లైన్ గేమింగ్ ఆదాయాలపై 28% వస్తువులు & సేవల పన్ను అక్టోబర్ 2023 నుండి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 2023లో ఇల్లీగల్ బెట్టింగ్‌ను నేరంగా పరిగణించి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తుంది. 2022 నుండి అధికారులు 1,400కు పైగా అక్రమ బెట్టింగ్, జూదం సైట్‌లను బ్లాక్ చేశారు.
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ చట్టపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. గత 70 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఇంకా వివిధ హైకోర్టులు స్కిల్ గేమ్స్ జూదం పరిధిలోకి రావని తీర్పు ఇచ్చాయి. కేవలం చట్టపరమైన సమస్యలే కాకుండా ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం వల్ల తీవ్రమైన ఆర్థిక, సామాజిక పరిణామాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన తెలిపాయి.
ప్రస్తుతం భారతదేశంలో 45 కోట్లకు పైగా ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. నిషేధం వల్ల వీరిని అక్రమ ఆపరేటర్ల వైపు మళ్లిస్తుంది. దీంతో మోసాలు, వ్యసనం, ప్రమాదాలు పెరుగుతాయి. అక్రమ ఆఫ్‌షోర్ జూదం ఆపరేటర్ల వల్ల భారత ప్రభుత్వం $4 బిలియన్ల కంటే ఎక్కువ జీఎస్టీ ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ మొత్తం చట్టబద్ధమైన భారతీయ గేమింగ్ పరిశ్రమ మొత్తం ఆదాయం కంటే ఎక్కువ.
ప్రస్తుతం 2500 కోట్ల విలువ ఉన్న ఈ పరిశ్రమ ఏటా రూ. 25 వేల కోట్లకు పైగా పన్నులను అందిస్తోంది. ఇంకా లక్షల మందికి ఇంజనీరింగ్, యానిమేషన్, గేమ్ డిజైన్ వంటి రంగాలలో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ పరిశ్రమ ఏటా 20% వృద్ధి చెందుతోంది ఇంకా 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా.