ఆశారాం బాపూని దోషిగా తేల్చిన కోర్టు

ఆశారాం బాపూని దోషిగా తేల్చిన కోర్టు

ఆశారాం బాపూకు గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు షాకిచ్చింది. అఘాయిత్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని గాంధీనగర్ కోర్టు దోషిగా తేల్చింది. తన అనుచరుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై  ఆశారాం బాపూ అఘాయిత్యం చేశారని 2013లోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయన్ను  దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఆశారాంకు మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ఆశారాంతో పాటు..సహా మొత్తం ఏడుగురు నిందితులు కాగా...ఆశారాం బాపుని తప్ప మిగతా వారందరినీ ఇప్పటికే దోషులుగా తేల్చారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఇన్నాళ్లు ఆశారాంను దోషిగా కోర్టు నిర్థారించలేదు. ఈ నిందితుల్లో ఆశారాం సతీమణి, కూతురు కూడా ఉండటం గమనార్హం. 

సూరత్‌కు చెందిన ఓ మహిళపై ఆశారాం బాపూ పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డట్లు 2013లో ఆరోపణలు వచ్చాయి. తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో ఆగస్టులో ఇండోర్‌లో ఆశారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలపై 2018లో జోధ్‌పూర్‌లోని ట్రయల్ కోర్ట్ ఆశారాంను  దోషిగా తేల్చింది. అప్పటి నుంచి జోధ్‌పూర్ జైల్లోనే ఆశారాం శిక్ష అనుభవిస్తున్నారు.