260 కిలోల ఎండు గంజాయి పట్టివేత ..నలుగురిని అరెస్ట్ చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు

260 కిలోల ఎండు గంజాయి పట్టివేత ..నలుగురిని అరెస్ట్ చేసిన  సంగారెడ్డి జిల్లా పోలీసులు

మునిప‌ల్లి, వెలుగు : ఒడిశా నుంచి మ‌హారాష్ట్రకు ఎండు గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 260 కిలోల సరకుతో పాటు రూ.17,500 న‌గ‌దు, 4 సెల్‌ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.  ఎస్పీ ప‌రితోశ్​ పంక‌జ్ ఆదేశాలతో మునిప‌ల్లి మండ‌లం కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద బుధవారం పోలీసులు వాహ‌నాల తనిఖీ చేపట్టారు.  

రెండు కార్లను ఆపి త‌నిఖీ చేయ‌గా 260 కిలోల ఎండు గంజాయి లభించింది. ఒడిశాకు చెందిన రాజ్‌ కుమార్ చెప్పడంతో గంజాయిని మహారాష్ట్రలోని మాలెగావ్ కు తరలిస్తున్నారు. పిటారా పరిచ్చా, డేవిడ్ పాల్, ధరంచంద్ పైక్,  సంజీవ్ కుమార్ పరిచ్చాను అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ ఇన్ స్పెక్టర్ సుమన్ కుమార్, మునిపల్లి ఎస్ఐ రాజేశ్​నాయక్, సంగారెడ్డి నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వర్ రావు, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ ప‌రితోశ్​ పంకజ్ అభినందించారు.