ఆసియా టీమ్‌‌ నుంచే సెలెక్ట్‌‌ చేయండి: గావస్కర్‌‌

ఆసియా టీమ్‌‌ నుంచే సెలెక్ట్‌‌ చేయండి: గావస్కర్‌‌

న్యూఢిల్లీ: ఆసియా కప్‌‌ కోసం ఎంపిక చేసిన 17 మంది టీమ్‌‌ నుంచే వరల్డ్‌‌ కప్‌‌ జట్టు (15)ను తీసుకోవాలని ఇండియా బ్యాటింగ్‌‌ లెజెండ్‌‌ సునీల్‌‌ గావస్కర్‌‌ సూచించాడు. కొత్త వారికి చాన్స్‌‌ ఇచ్చి లేనిపోని వివాదాలను సృష్టించొద్దన్నాడు. ‘ఆసియా టీమ్‌‌ సెలెక్షన్‌‌ అయిపోయింది. ఇప్పుడు అదే మన జట్టు. అశ్విన్‌‌, ఇతరత్రా ప్లేయర్ల గురించి మాట్లాడి వివాదాలు సృష్టించొద్దు. కొంత మంది అదృష్టవంతులు ఉంటారు. 

అలాంటి వాళ్లకు ఒక్కోసారి చోటు దక్కొచ్చు, దక్కకపోవచ్చు. ఇప్పుడు అవేమీ పట్టించుకోవద్దు. ఒకవేళ పట్టించుకుంటే మ్యాచ్‌‌లు చూడటం మానేయండి. వాళ్ల ప్లేస్‌‌లో మరొకర్ని ఎంచుకుంటే బాగుండేది అని చెప్పడం మానేయాలి. అది తప్పుడు సంకేతాలిస్తుంది’ అని సన్నీ పేర్కొన్నాడు. ఫార్మాట్లకు అనుగుణంగా జడేజా, అక్షర్‌‌ పటేల్‌‌కు  బ్యాటింగ్‌‌ చేసే సత్తా ఉందన్నాడు.