
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీలో బీ ఫార్మసీ సీట్లను పెంచుకోవడానికి ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. 2025–-26 అకాడమిక్ ఇయర్ నుంచి అదనంగా 40 సీట్లకు అడ్మిషన్లు తీసుకోవడానికి అనుమతి లభించిందని స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ జి. శివకుమార్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఫార్మసీ కౌన్సిల్ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్, సెక్రటరీ నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు వెల్లడించారు.
బీ ఫార్మసీ సీట్ల పెంపుతో పాటు ఎం ఫార్మసీలోని ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ కోర్సులో అనుమతించిన సీట్లను యథాతథంగా కొనసాగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. పీసీఐ ఉత్తర్వుల విషయంలో గీతం ప్రోవీసీ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆయా శాఖల డైరెక్టర్లు, విభాగాధిపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల అవకాశాలను పెంచి ఫార్మసీ నిపుణులను పెంచడంలో గీతం నిబద్ధతతో ముందుకు వెళ్తుందని చెప్పారు.