రామచంద్రాపురం(పటాన్చెరు) వెలుగు: గీతం వర్సిటీలో సినీ వారం-2025 కార్యక్రమాలు రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. జీ స్టూడెంట్ లైఫ్, ఎఫ్ఏబీవో సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ పోటీలు, వర్క్‌షాప్‌లు, ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి రోజు ఫొటో గ్రాఫర్ మహేశ్ పమిడి మర్తి ట్రావెల్ ఫొటోగ్రఫీపై ఉపన్యసించగా, ప్రముఖ దర్శకుడు దేవా కట్టా డైలాగ్ రైటింగ్ పై వర్క్‌షాప్ నిర్వహించారు.
చివరగా విద్యార్థులే నిర్మించిన స్ఫూర్తిదాయకమైన షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించారు. రెండో రోజు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల నేతృత్వంలో చిత్ర నిర్మాణం, స్క్రీన్ రైటింగ్‌పై శిక్షణ జరిగింది. అనంతరం ఎంపిక చేసిన షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌రాజ్, గీతం పూర్వ విద్యార్థి, నటుడు హర్ష చెముడు తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
