
భారీ వర్షాల వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారని చెప్పారు. V6 న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆమె.. ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని.. ఎక్కడ సమస్య లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ALSO READ | వర్షాలపై బల్దియా అలర్ట్.. అధికారులకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు
వాటర్ ఆగిపోయిన పాయింట్స్, మూసి పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పై నిరంతరం నిఘా పెట్టామన్నారు ఆమ్రపాలి. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. సెప్టెంబర్ 2న భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని చెప్పారు అమ్రపాలి. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ లో FTL కు చేరుకునేందుకు బాగా సమయం పడుతుందన్నారు .అయిన సరే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే జనం ను అలెర్ట్ చేశామని చెప్పారు.