ముగిసిన జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్

 ముగిసిన జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ సోమవారం విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ముగిసింది. కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, మ్యూజికల్ చైర్, టెన్నీకాయిట్, క్యారమ్స్, లెమన్ అండ్ స్పూన్ రేస్, అథ్లెటిక్స్ నిర్వహించారు. విజేతలకు సోమవారం బహుమతులు, షీల్డ్ లు అందజేశారు. 

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. క్రీడా కార్యక్రమాలు ఉద్యోగులు, మీడియా, ప్రజా ప్రతినిధుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయన్నారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి,  స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ సుభద్ర, కార్పొరేటర్లు పాల్గొన్నారు.