
ఫుడ్ ఆర్డర్‌తో ఆలస్యంగా వచ్చినందుకు జొమాటో డెలివరీ ఏజెంట్‌పై ఇద్దరు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని శోభా థియేటర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు నిందితుల ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అయింది. జొమాటో డెలివరీ ఏజెంట్ వచ్చినప్పుడు, వారు అతన్ని ప్రశ్నించారు. చివరికి అది గొడవగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఒకరు సమీపంలో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్‌ను తీసుకొని డెలివరీ ఏజెంట్ తలపై రెండుసార్లు కొట్టారు. ఆ తర్వాత మరొక వ్యక్తి కుర్చీని తీసుకొని అతనిని కొట్టాడు. ఈ సంఘటనకి సంబంధించి ఎటువంటి పోలీసులు కేసు నమోదు కాలేదు.
ఈ సంఘటన గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమంపై మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యంగా డెలివరీ సిబ్బంది ఫాస్ట్ డెలివరీపై ఒత్తిడి ఎదుర్కొంటారు. గిగ్ కార్మికుల గౌరవం కాపాడడానికి, ఇలాంటి సంఘటనల నుండి రక్షించడానికి బలమైన రక్షణ, అవగాహన చట్టాలు అవసరమని పిలుపునిస్తున్నారు.