గోవా బీచ్లో చెత్త శుభ్రం చేసిన బాలీవుడ్ స్టార్స్ 

గోవా బీచ్లో చెత్త శుభ్రం చేసిన బాలీవుడ్ స్టార్స్ 
  • క్లీన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్

పనాజీ : గోవాలోని మిరామర్ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. పనాజీలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వెళ్లిన సినీ నటులు పారిశుధ్యం, పర్యావరణకు ప్రాధాన్యతనిస్తూ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో పాల్గొని పర్యాటకులను, స్థానికులను ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బాలీవుడ్ నటులతో కలసి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. 

పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని.. గోవాలోని సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోవా అందాలను కాపాడేందుకు తమ వంతుగా దేనికైనా సిద్ధమని బాలీవుడ్ స్టార్స్ ప్రకటించారు. బీచ్ లకు వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడమే కాదు.. పరిసరాలు క్లీన్ గా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్‌లో అమృతా ఫడ్నవీస్, జాకీ ష్రాఫ్, కొరియోగ్రాఫర్, రెమో డిసౌజా, నటుడు కరణ్ కుంద్రా, సింగర్, హేమ సర్దేశాయ్ పాల్గొన్నారు.