సైలెంటుగా మీ ఫోన్‌ల నుండే స్కామ్ మెసేజ్‌లు : వింగో (Wingo) గేమింగ్ యాప్‌పై నిషేధం

సైలెంటుగా మీ ఫోన్‌ల నుండే స్కామ్ మెసేజ్‌లు : వింగో (Wingo) గేమింగ్ యాప్‌పై నిషేధం

మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఇతరులకు స్కామ్ మెసేజ్‌లు వెళ్తున్నాయంటే నమ్ముతారా.. ? సరిగ్గా ఇదే కారణంతో భారత ప్రభుత్వం వింగో (Wingo) అనే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను నిషేధించింది. ఈ యాప్ ద్వారా జరుగుతున్న భారీ మోసాన్ని హోం మంత్రిత్వ శాఖ బయటపెట్టింది.

అసలేం జరిగింది:
వింగో యాప్ వాడుతున్న లక్షల మందికి తెలియకుండానే, వారి ఫోన్‌లను వాడుకుని ఈ యాప్ ఇతరులకు నకిలీ మెసేజులు (SMS) పంపుతోంది. ఇలా పంపిన మెసేజ్‌ల ద్వారా అమాయకులను పెద్ద స్కామ్‌లోకి లాగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ యాప్‌ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిలిపివేసింది.

స్కామ్ ఎలా జరుగుతుందంటే:
 యూజర్లకి తెలియకుండానే వారి ఫోన్‌ల నుండి స్కామ్ SMSలు సైలెంట్ గా వేరే  వాళ్ళకి వెళ్తాయి.  ఈ యాప్ నెట్‌వర్క్ లక్షల మంది ఫోన్‌లను ఉపయోగించుకుని కోట్లలో మెసేజ్‌లు పంపింది. ప్రభుత్వ చర్యతో సైబర్ క్రైమ్ సెంటర్ (I4C) ఈ యాప్ సర్వర్‌లను బ్లాక్ చేసింది.

ఆండ్రాయిడ్ యూజర్లలకు  హెచ్చరిక:
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సోషల్ మీడియా ద్వారా  ప్రజలను హెచ్చరించింది. వింగో యాప్‌ను అస్సలు ఇన్‌స్టాల్ చేయకండి, ఒకవేళ చేసిన ఇప్పటికే మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి అని కోరింది.

►ALSO READ | ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. నాన్ స్టాప్ ప్లేబ్యాక్.. ధర కూడా తక్కువే..

యాప్‌తో పాటు దానిని ప్రచారం చేస్తున్న ఇతర మార్గాలను కూడా ప్రభుత్వం మూసివేసింది. దాదాపు 1.5 లక్షల మంది ఉన్న 4 టెలిగ్రామ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేశారు. ఇంకా ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న 53 యూట్యూబ్ వీడియోలను తొలగించారు. చివరికి సుమారు 1.5 కోట్ల నకిలీ మెసేజ్‌లు ప్రజలకు చేరకుండా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో జూదానికి సంబంధించిన యాప్‌లపై కఠిన నిషేధం ఉందిని  సంగతి తెలిసిందే..