రాజ్భవన్ ముట్టడి నన్ను బాధించింది: గవర్నర్

రాజ్భవన్  ముట్టడి నన్ను బాధించింది: గవర్నర్

ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడించడం తనను బాధించిందన్నారు గవర్నర్ తమిళి సై. ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకిని కాదని ట్వీట్  చేశారు. గతంలో సమ్మె సమయంలోనూ  కార్మికులకు అండగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు కార్మికుల వైపే ఉంటానని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ప్రయత్నిస్తున్నాని అన్నారు.

ఆర్టీసీ బిల్లును ఆమోదించాలంటూ వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావారణ  ఏర్పడింది. ఈ క్రమంలో  ప్రస్తుతం పుదుచ్ఛేరిలో ఉన్న గవర్నర్  ఆర్టీసీ యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. యూనియన్ నాయకులు రాజ్ భవన్  లోకి రావాలంటూ ఆహ్వానించారు. 10 మంది కార్మిక సంఘాల నేతలను రాజ్ భవన్ లోకి ఆహ్వానించారు. పుదుచ్ఛేరి నుంచి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు.