మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణల అనంతరం ఏకగ్రీవాల, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మెదక్ జిల్లాలో..
మెదటి విడతలో మెదక్ జిల్లాలో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగాఅందులో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల విత్‌డ్రాల అనంతరం మిగతా 144 సర్పంచ్ స్థానాలకు 411 మంది అభ్యర్థులు బరిలో మిగలారు. 1,402 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 332 వార్డు మెంబర్ స్థానాలు ఏక్రగీవమయ్యాయి. రెండు వార్డులకు అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. అవిపోను 1,068 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,426 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో పోటీపడే అభ్యర్థుల్లో సయోధ్య కుదరక ఒక్కో పార్టీ నుంచి బలపరిచిన ఇద్దరు క్యాండిడేట్లు బరిలో నిలిచారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు 136 గ్రామ పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 పంచాయతీలు, 113 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 129 పంచాయతీల్లో 394 మంది అభ్యర్థులు, 1,133 వార్డు స్థానాలకు 2,849 మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు. ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వినకపోవడంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీకి కష్టపడ్డామని ఒకరు.. తమదే విజయమని ఇంకొకరు పోటీలో ఉంటున్నారు.
సిద్దిపేట జిల్లా..
సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగుతుండగా16 ఏకగ్రీవమయ్యాయి. అవిపోను 147 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 594 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 1,432 వార్డులకు 224 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 1,208 స్థానాలకు 3,107 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.
సిద్దిపేట జిల్లా..
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
గజ్వేల్ 25 77 230 490
దౌల్తాబాద్ 25 88 214 408
జగదేవ్ పూర్ 25 159 222 560
మర్కుక్ 16 65 140 308
ములుగు 26 76 222 516
రాయపోల్ 19 51 166 312
వర్గల్ 27 78 238 513
మొత్తం 163 594 1,432 3,107
మెదక్ జిల్లా
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
అల్లాదుర్గం 16 56 152 283
హవేలీ ఘనపూర్ 30 91 262 503
పాపన్నపేట 40 93 348 545
రేగోడ్ 18 46 152 307
పెద్దశంకరంపేట 27 59 238 438
టేక్మాల్ 29 66 250 350
మొత్తం 160 411 1,402 2,426
సంగారెడ్డి జిల్లా..
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
సంగారెడ్డి 11 38 90 233
కంది 20 56 194 513
కొండాపూర్ 24 77 200 499
సదాశివపేట 29 86 260 629
పటాన్ చెరువు 3 12 36 99
గుమ్మడిదల 8 30 66 169
హత్నూర 34 95 287 707
మొత్తం 129 394 1,133 2,849
