పెండ్లి కొడుకా మజాకా. .. 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా ... పిల్ల ఇంటికి

పెండ్లి కొడుకా మజాకా. .. 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా ... పిల్ల ఇంటికి

సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్‌లోనే, గుర్రం బగ్గీలోనో లేదంటే ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి (లగ్గం మీదకు వెళ్లడానికి ముందు పెండ్లి కొడుకు సేదదీరే ఇల్లు) చేరుకుంటాడు. పెండ్లి ముహూర్తం సమయానికి కాసేపటి ముందు పెండ్లి కూతురు తరఫువాళ్లు బాజాభజంత్రీలతో అక్కడికి వచ్చి పెండ్లి కొడుకును లగ్గం మీదికి తీసుకెళ్తారు. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఓ పెండ్లి కొడుకు మాత్రం అందరిలా కాకుండా భిన్నంగా పెండ్లిపిల్ల గ్రామానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

51 ట్రాక్టర్లతో వివాహ ఊరేగింపు

ఓ వరుడి వినూత్న ఆలోచన అందర్నీ ఆలోచింపచేసేలా చేసింది. తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్‌ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్‌ బార్మర్‌లో జరిగింది.

వివరాల్లోకెళ్తే..

బర్మేర్‌లోని సేవినియల గ్రామానికి చెందిన జేతారామ్‌ అనే యువ రైతుకు బొర్వా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. జూన్ 8న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. వధువు గ్రామంలో వివాహం కావడంతో వినూత్నంగా ఊరేగింపుగా వెళ్లాలని రాధేశ్యామ్ భావించాడు. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో  51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు వరుడు  మాట్లాడుతూ..నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు.ఈ ఊరేగింపులో సుమారు 150 మంది వరకూ అతిథులు, బంధువులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో

మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్‌ ఉపయోగించారు. నేనెందుకు 51 ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని ఇలా చేసినట్లు వివరించాడు వరుడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి జేతారామ్‌ మాట్లాడుతూ..ట్రాక్టర్‌ను భూమి కొడుకుగా పరగణిస్తాం. మా నాన్న, తాతయ్యల ఊరేగింపు ఒంటెలపై సాగింది. అదీగాక మా కుటుంబంలో ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు మిత్రులతో కలిసి ఇన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తున్నప్పుడూ వాటిపై ఎందుకు ఊరేగింపు చేయకూడదన్న ఆలోచనతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు  జేతారామ్‌.  ఈ ట్రాక్టర్ల ఊరేగింపునకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

https://twitter.com/ANI/status/1534949223904735233