టీఆర్ఎస్ పార్టీలో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు

టీఆర్ఎస్ పార్టీలో  బయటపడ్డ గ్రూపు రాజకీయాలు

ఆదిలాబాద్.. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ  గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. బోథ్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై జెడ్పి సమావేశం గందరగోళంగా మారింది. బోథ్ మండలంలో  మూడేళ్లుగా జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని ఇటీవల అధికారులు విచారణ మొదలు పెట్టారు. అయితే ఆడిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయకపోవడాన్ని నిరసిస్తూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జడ్పీ సమావేశాన్ని బైకాట్ చేశారు. అంతలోనే కలెక్టర్ కల్పించుకొని... బోథ్ MPDO రాధను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విచారణ పూర్తి కాకుండా, ఎమ్మెల్యే ఒత్తిడితో  MPDOను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ నిర్ణయానికి నిరసనగా MPP తుల శ్రీనివాస్.. జెడ్పీ సమావేశాన్ని బైకాట్ చేశారు. అటు కాంగ్రెస్ జెడ్పిటిసి సైతం EGS పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. MPDO భర్త అకౌంట్ లోకి మండల అభివృధ్ది నిధులను మళ్లించారని ఆరోపించారు.  MPDO సస్పెండ్ తో ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

For More News..

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి