యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి

యాదాద్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. యాదగిరి గుట్టను దర్శించుకున్న అనంతరం ప్రెస్‎మీట్ నిర్వహించిన ఆయన పైవ్యాఖ్యలు చేశారు.  ‘ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఇది జరిగింది. మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయకున్నా ఆలయాన్ని ప్రారంభించి.. భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదు. యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి.. టీఆర్ఎస్ లీడర్లకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెట్టొద్దు. ఆలయ నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి. వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలి. యాదాద్రికి 22 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్.. యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా.?  ఆలయ ప్రారంభాన్ని తూతూ మంత్రంగా చేయడంతో గుట్టలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా నయా పైస ఇయ్యలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. యాదాద్రి ఆలయం ఒక సినిమా సెట్టింగ్‎ను తలపిస్తోంది. గతంలో ఆనంద్ సాయి ఏ టెంపుల్‎కు ఆర్కిటెక్చర్‎గా పనిచేయలేదు. ఆలేరు నియోజకవర్గ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’ అని కోమటిరెడ్డి అన్నారు.

For More News..

డ్రగ్స్ వాడితే నగర బహిష్కరణే

పార్టీలకు హాజరైన మోడల్స్ గురించి పోలీసుల ఆరా