లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలో గైనిక్ సేవలు

లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలో గైనిక్ సేవలు

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో ఇటీవల ప్రారంభమైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు (గైనకాలజీ) ప్రారంభం కానున్నాయి. గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి రావు ఆదివారం డ్యూటీలో జాయిన్ అయ్యారు. మహిళలకు అత్యవసరమైన ప్రసూతి సేవలతో పాటు సర్జరీలు నిర్వహించనున్నారు.

 లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, మండలాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ గైనకాలజిస్ట్ లేకపోవడంతో మహిళలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో జగిత్యాల, మంచిర్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ గైనకాలజిస్ట్​ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత మహిళల సమస్య తీరినట్లే. వారంలోగా గైనిక్ సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ​ఆకుల శ్రీనివాస్ ​తెలిపారు.