హైదరాబాద్ హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగస్టు 2వ తేదీ అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు.
రెస్టారెంట్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్ - సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా హబ్సి గూడ సికింద్రాబాద్ ప్రధాన మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
