
పొడవైన జుట్టు.. హెయిర్ బ్యూటీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాని బిజీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు.. అధిక పని ఒత్తిడితో అన్నీ మారిపోయాయి. దీంతో అందరూ సమస్య జుట్టు రాలిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మనం రోజు కిచెన్ లో వాడే ఉల్లిపాయతో నూనె తయారు చేసి దానిని తలకు పట్టిస్తే ఈ ప్రోబ్లం నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
వైద్య శాస్త్ర ప్రకారం... ఉల్లిపాయలో అనేక విటమిన్లు ఉన్నాయి. విటమిన్ బీ, సి, ఈ వీటితోపాటు పొటాషియం.. జింక్.. యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఈ ఆయిల్‌ను తలకు రాసుకుంటే... చుండ్రును తగ్గించడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఉల్లిపాయతో నూనె తయారు చేయడానికి కావలసినవి:
- ఉల్లిపాయలు : 2 పెద్దవి
- కొబ్బరి నూనె లేదా ఆవ నూనె : అర కప్పు
తయారీ విధానం: ఉల్లిపాయను తురుము కోసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి తక్కువ మంట మీద వేయించాలి. గోధుమ రంగులోకి మారి సువాసన వచ్చే వరకు ఉడికించాలి. ఈ నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోండి. అంతే ఆనియన్ హెయిర్ రడీ..
ఉయపయోగించే విధానం: ముందుగా నూనెను కొద్దిగా వేడి చేయాలి. తరువాత తలపై కొద్దిగా వేసుకొని మసాజ్ చేస్తూ.. జుట్టుకుదుళ్లకు రాయాలి. తరువాత ఎంత పొడవు ఉంటే .. అంత వరకు ఈ ఆయిల్ ను పట్టించాలి. అలా గంటసేపు ఉంచాలి. లేదంటే రాత్రి సమయంలో రాసుకోవాలి. తరువాత షాంపోతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించాలి.
ఉల్లిపాయ నూనెతో ఉపయోగాలు:ఉల్లిపాయలో సల్ఫర్, యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. వీటిలో జుట్టును బలోపేతం చేసే లక్షణాలు ఉన్నాయి. అంతేకాక జుట్టు పెంచేలా .. హెర్ అందంగా.. ఆరోగ్యంగా ఉండేలా ఎంతో ఉపయోపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మీరు కూడా ఉల్లి ఆయిల్‌ను తలకు పట్టించి.. జుట్టును అందంగా మార్చుకోండి..