పది లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

పది లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్  స్నేహ శబరీశ్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతతోపాటు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు, హెచ్ఎంలు సమన్వయంతో పని చేయాలని   ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో ఎంఈవోలు, హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఈవో గిరిరాజ్ గౌడ్, అసిస్టెంట్ కంట్రోలర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్  భువనేశ్వరి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. 

స్నేహ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలవ్వాలి

కిశోర బాలికల కోసం స్నేహ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు.  కలెక్టరేట్ లో గురువారం అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ.. 14 నుంచి -18 ఏండ్ల వయసున్న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్డీవో శ్రీను, డీడబ్ల్యూవో జయంతి, డీఈవో గిరిరాజ్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్ ఆఫసీర్ నరసింహ స్వామి, డీఐఈవో గోపాల్ తదితరులున్నారు.