- ఎమ్మెల్యే మదన్మోహన్రావు
లింగంపేట,వెలుగు: య్యారునియోజకవర్గంలో బస్సుల కొరత, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసుల లేమి, రోడ్డు కనెక్టివిటీ సమస్యలపై ఎండీకి విపతిపత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మంగళవారం టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డితో కలిసి హైదరాబాలోని బస్ భవన్లో సమావేశమ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజక వర్గానికి ఇటీవల 10 ఎలక్ర్టిక్ బస్సులను కేటాయించారని, మరిన్ని కొత్త బస్సులు వేయాలన్నారు.
బస్సు డిప ను స్థాపించి గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు విస్తరించాలని ఎండీకి వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యం, అబివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడమే తన లక్ష్యమని తెలిపారు. డిపో ఏర్పాటుకు కృషి చేస్తామని ఎండీ నాగిరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
