
హనుమకొండ, వెలుగు: జిల్లాలోని కమలాపూర్, హసన్ పర్తి మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో వానకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. మహిళా రైతుల సౌకర్యం కోసం టెంపరరీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ డీపీఎం రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.