దోహా: బ్యాటింగ్‌లో రాణించిన ఇండియా–ఎ జట్టు.. ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో హర్ష్ దూబే (53 నాటౌట్), నమన్ ధీర్ (30) నిలకడగా ఆడటంతో.. మంగళవారం (నవంబర్ 18) జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది.
టాస్ ఓడిన ఒమన్ 20 ఓవర్లలో 135/7 స్కోరు చేసింది. వాసిమ్ అలీ (54 నాటౌట్), కెప్టెన్ హమద్ మీర్జా (32) మెరుగ్గా ఆడాడు. తర్వాత ఇండియా 17.5 ఓవర్లలో 138/4 స్కోరు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాన్షు ఆర్యా (10) ఫెయిలయ్యారు. ఈ దశలో హర్ష్ దూబే కీలక భాగస్వామ్యాలు జోడించాడు.
