24 గంటల్లో 2.76 లక్షల కేసులు.. 3874మరణాలు

24 గంటల్లో 2.76 లక్షల కేసులు..  3874మరణాలు

దేశంలో కరోనా కేసులు గత రెండు రోజులుగా మూడు లక్షల లోపు నమోదవుతున్నాయి. అయితే ఇవాళ రోజు వారీ మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. మొన్న4500 కు పైగా మరణాలు నమోదవ్వగా నిన్న,3874 మరణాలు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 20లక్షల55 వేల 10 మందికి టెస్టులు చేయగా 2,76,110 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,57,72,400కు చేరగా..మరణాలు 2,87,122 కు చేరాయి. నిన్న 3,69,077 మంది కోలుకున్నారు. ఇంకా 31,29,878 ఆక్టివ్ కేసులున్నాయి.