ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలె : జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలె : జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్

హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్(జీహెచ్ఎంఈయూ) ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని యూనియన్ ఆఫీసు వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే పేరు లేకుండా అందరినీ పర్మినెంట్ చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కొన్ని డిపార్టుమెంట్లలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినప్పటికీ ఔట్ సోర్సింగ్ వారిని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు నడవకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జూన్ 2 లోపు ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి ఇండ్ల స్థలాలను ప్రకటించాలని డిమాండ్​చేశారు. లేకపోతే అన్ని యూనియన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి మరో మలిదశ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నర్సింగ్ రావు, ఔట్​సోర్సింగ్ అధ్యక్షుడు జె.రాము, నార్త్ జోన్ అధ్యక్షుడు రాకేశ్, సౌత్ జోన్ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.