
ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా గచ్చిబౌలి స్టేడయంలో హెచ్ ఎఫ్ సి, నార్త్ ఈస్ట్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 6-1తో నార్త్ ఈస్ట్ జట్టు పై ఘన విజయం సాధించింది. పూర్తి మ్యాచ్ లో ఆధిపత్యం వహించిన హైదరాబాద్, నార్త్ ఈస్ట్ జట్టుని చిత్తు చేసింది. ఈ గెలుపుతో హెచ్ ఎఫ్ సి 28 పాయింట్స్ తో టేబుల్ టాప్ లో నిలిచింది. 12 మ్యాచ్ లు ఆడిన నార్త్ ఈస్ట్ జట్టు కేవలం కేవలం ఒక దాంట్లోనే గెలిచి టేబుల్ చివరన ఉంది.
మ్యాచ్ ప్రారంభం అయిన 30 నిమిషాల్లోనే హైదరాబాద్ 3 గోల్స్ చేసింది. హైదరాబాద్ జట్టు లో జే.సివెరియో 2 గోల్స్ చేశాడు. హెరెర, ఒడీ, చియానేస్ చెరో ఒక గోల్ చేశారు. మ్యాచ్ 80 నిమిషం దగ్గర నార్త్ ఈస్ట్ సెల్ఫ్ గోల్ చేయడంతో హైదరాబాద్ కి ఎక్స్ట్రా గోల్ యాడ్ అయింది. నార్త్ ఈస్ట్ టీమ్ లో ఎవాన్స్ ఒక గోల్ చేశాడు.