ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఫిక్స్ : జాసన్ బ్లమ్

ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఫిక్స్ : జాసన్ బ్లమ్

ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా కొనసాగుతోంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయ్యింది. విదేశాల్లో సైతం ఈ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని అభిమానులు అంటున్నారు. తాజాగా హాలీవుడ్ నిర్మాత జేసన్ బ్లమ్ ఈ మూవీకి ఆస్కార్ ఖాయమని ట్వీట్ చేశారు. 

‘‘ఆర్ఆర్ఆర్ మూవీ తప్పకుండా ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ఆర్ఆర్ అవార్డు గెలుచుకున్న బెస్ట్ పిక్ తో నేను వెళ్తాను. దయచేసి ఆస్కార్స్‌కి ఆర్‌ఆర్ఆర్‌ని గుర్తించండి’’ అని జేసన్ బ్లమ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ టీం రిప్లై ఇచ్చింది. ‘‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాము అది చాలు’’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఆర్ఆర్ఆర్ భారత్ తరుపున ఆస్కార్కు అధికారిక ఎంట్రీ సాధించలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ స్వయంగా  ఈ సినిమాను ఆస్కార్‌కు పంపింది. ఉత్తమ చిత్రం, సంగీతం, ఉత్తమ నటుడు వంటి విభాగాల్లో ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ ను తెచ్చుకుంది.