హోం వర్క్ చేసే మెషీన్ వచ్చేసింది.. పిల్లల కంటే బాగా రాస్తుంది

హోం వర్క్ చేసే మెషీన్ వచ్చేసింది.. పిల్లల కంటే బాగా రాస్తుంది

స్కూల్లో హోం వర్క్  ఎక్కువ ఇచ్చారా.. అమ్మో ఇంత హోం వర్క్ చేయలేమని దిగులు పడుతున్నారా.. హోం వర్క్ చేయకపోతే మరుసటి రోజు టీచర్ ఏ మంటుందని భయపడుతున్నారా.. ఇక ఇలాంటి వాటన్నింటికి చెక్ పెట్టేందుకు హోం వర్క్ చేసే మిషన్ అందుబాటులోకి వచ్చింది.  AI తో తయారు చేసిన హోం వర్క్ యంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  . 

ఇప్పుడు అన్నీ పనులకు  మిషన్లు వచ్చేశాయి.  అన్నం వండే దగ్గరి నుంచి.. ఇంటిని శుభ్రం చేయడం.. చివరకు హోటల్ లో సర్వ్ చేసేందుకు కూడా యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.  ఇప్పుడు AI అభివృద్ది చెందడంతో అది ఇంకా డెవలప్ అయింది.  మొన్న టీవీలో వార్తలు చదివిన AI .. ఇప్పుడు పిల్లల స్కూల్ హోం వర్క్ చేసింది.  

కంప్యూటర్ యుగంలో పిల్లలకు హోం వర్క్  చేయడం చాలా కష్టమైన పనిగా ఉంది.  దీని కోసం వారు అనేక రకాల ట్రిక్ లను ఉపయోగిస్తున్నారు.  కొంతమంది పిల్లల హోం వర్క్ ను తల్లిదండ్రులు చేస్తారు.  అయితే  ఇప్పుడు  AI చాట్‌బాట్‌లను అడగడం ద్వారా విద్యార్థులు తమ హోంవర్క్‌ను పూర్తి చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లో ఒక విద్యార్థి తన హోం వర్క్ ను  యంత్రంతో పూర్తి చేశాడు.  చేతి రాత చాలా  అద్భుతంగా ఉంది.  ఈ రాతను చూసిన  ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు.  

ఈ వీడియో Tansung Yagen (@TansuYegen) ఖాతా నుండి ట్విట్టర్‌ నుంచి పోస్ట్ అయింది.  చేయబడింది. 'ఉపాధ్యాయులు - AI వచ్చిన తర్వాత మాత్రమే మేము చేతితో వ్రాసిన ప్రాజెక్ట్‌లను తీసుకుంటాము, దీనిపై పిల్లల సమాధానం' అని అతను క్యాప్షన్‌లో రాశాడు. ఆ వీడియో చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నోట్ బుక్ పేజీలపై ఆటోమేటిక్ మెషీన్ ఏదో వ్రాస్తున్నట్లు మీరు చూడవచ్చు. కేవలం 15 సెకన్లలో  చాలా పేజీలను వ్రాసింది.పేజీలు వాటికవే మారుతున్నాయి. ఈ వీడియో క్లిప్
నాలుగు  రోజుల క్రితం Twitterలో పోస్ట్ అయింది.   ఇప్పటివరకు (వార్త రాసే సమయానికి)  2.5 మిలియన్ మందికి పైగా వీక్షించారు.    ఈ వీడియోను 26 వేల మందికి పైగా లైక్ చేయగా, దాదాపు 6 వేల మంది రీట్వీట్ చేశారు. యంత్రం ఎంత సులువుగా రాస్తుందని.. , అది కూడా మనుషుల చేతివ్రాతలో ఉన్న ఆవిష్కరణను చూసి జనాలు చలించిపోతున్నారు. ఒక వినియోగదారు రాశారు, ఇది చాలా అద్భుతమైన ఆవిష్కరణ. పిల్లలు చాలా ఇష్టపడతారు, కానీ ఇది చాలా ప్రమాదకరం' అని మరొకరు వ్యాఖ్యానించారు.