హెచ్ఐవీ బాధిత మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ

హెచ్ఐవీ బాధిత మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ

శివ్వంపేట, వెలుగు: విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారతపై 9 ఏళ్లుగా పని చేస్తోన్న హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మండల పరిధి మగ్ధుంపూర్ లోని బేతని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఉంటున్న హెచ్ఐవీ మహిళలకు ఆదివారం 20 కుట్టు మిషన్లు అందజేశారు. ఆశ్రమంలో హెచ్ఐవీ బాధితులకు ఉచిత టైలరింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్ పై 3 నెలల శిక్షణ ఇచ్చారు. 

ట్రైనింగ్ పూర్తి కావడంతో  ఎపిక్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సాయంతో  20 మందికి కుట్టు మిషన్లను ఆందించింది. వారు కుట్టిన దుస్తులకు మార్కెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు  ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ హిమజ, ఫాదర్ సెబాస్టియన్, సిబ్బంది కర్మెలు  విన్సెంట్, వీరబాబు, రాజు పాల్గొన్నారు.