
ఒడిశాలో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ శుభమిత్ర సాహూ మృతదేహాన్ని పోలీసులు చివరికి కనిపెట్టారు. ఈ కేసులో నిందితుడైన ఆమె భర్త పోలీసు కానిస్టేబుల్ దీపక్ రౌత్ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం మొదట పోలీసులు శుభమిత్ర సాహూ మృతదేహాన్ని బయటికితీయగా ఆమె భర్తే ఆమెను హత్య చేసి అడవిలో పాతిపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
దింతో బుధవారం సాయంత్రం 39 ఏళ్ల రౌత్‌ను హత్య కేసు కింద అరెస్టు చేశారు. అతను గత సంవత్సరం 25 ఏళ్ల సాహూ, దీపక్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, హత్య తరువాత సాహూ మృతదేహం భువనేశ్వర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కియోంఝర్ అడవిలో పూడ్చిపెట్టాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.
సాహూ సెప్టెంబర్ 6 నుండి కనిపించకుండపొగ, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సాహూ, దీపక్ మధ్య డబ్బు విషయంలో గొడవలు ఉన్నాయని, దీపక్ సాహూ నుంచి రూ. 10 లక్షలు అప్పు తీసుకున్నాడని, సాహూ తన పెళ్లి కోసం మరింత డబ్బు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. అలాగే కోటి రూపాయల సాహూ జీవిత బీమా కోసం దీపక్ ఈ హత్య చేశాడా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాహూ నిరాశతో పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంటుందని, దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఆమె కోరుకున్నట్లు కాల్ రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సమాచారంతో పోలీసులు మూడు నగరాల్లో ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీపక్ రౌత్‌ను విచారించిన తర్వాత అతని కదలికలు ఫోన్ కాల్స్, అతను కలిసిన వ్యక్తుల ఆధారంగా పోలీసులు అతడే హంతకుడని తేల్చారు.
పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, దీపక్ రౌత్ సాహూను కారులో గొంతు నులిమి చంపి, తర్వాత అడవిలో పాతిపెట్టాడని, ప్రస్తుతం ఈ హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.