మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారు?

మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారు?

జీవితంలో ప్రతి బంధానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది వైవాహిక బంధంగా చెప్పొచ్చు. లైఫ్ మొత్తం ఒకరికొకరు తోడుగా ఉంటూ కలసిమెలసి జీవించడం అంత ఈజీ కాదు. లైఫ్ పార్ట్ నర్ మీద ఉండే ఇష్టం, పంచే ప్రేమ విషయంలో హెచ్చుతగ్గులు ఉండకూడదు. కాబట్టి ఒకసారి మీ జీవిత భాగస్వామితో మీరు ఎంత ప్రేమగా ఉంటున్నారు అనే దాన్ని చెక్ చేసుకోండి. కింద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా మీ జీవిత భాగస్వామిపై మీ ప్రేమానురాగాలు ఎంతగా ఉన్నాయో చూస్కోండి..


1. మీరు తరచూ మీ భాగస్వామి గురించి కలలు కంటున్నారా?
A. కొన్నిసార్లు
B. ఎల్లప్పుడూ
C. అవును 
D. కాదు

2. మీరు తరచూ మీ పార్ట్ నర్ గురించి చింతిస్తున్నారా?
A.  అవును, ఎప్పుడూ
B. అవును, ముఖ్యంగా వారు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు
C. లేదు, వాళ్లు పరిణతి చెందిన వారు కాబట్టి ఆలోచించను
D. అస్సలు చింతించను

3. ఒకరోజులో సగటున మీ పార్ట్ నర్ కు మీరు ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేస్తారు? 
A. రోజులో మూడు సార్లు
B. రోజులో ఐదు సార్లు
C. రోజుకు ఒకసారి
D. ఎప్పుడో ఒకసారి 

4. మీరు ఎప్పుడైనా మీ భాగస్వామిని వెంబడించారా?
A. అవును. ప్రేమ, మోజు ఎక్కువ కాబట్టి 
B. అవును, వాళ్లను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి
C. లేదు, అలా చేయడం కరెక్ట్ కాదు
D. లేదు, అలా చేయడం వెర్రితనం అవుతుంది కాబట్టి


5. మిమ్మల్ని తన జీవితంలో మళ్లీ చేర్చుకోమని మీ లైఫ్ పార్ట్ నర్ ను ఎప్పుడైనా బ్రతిమిలాడారా?
A. అవును, కానీ చాలా రోజుల కింద
B. అవును, బ్రేకప్ అయిన ప్రతిసారి
C. బ్రతిమిలాడటాన్ని గర్వంగా భావిస్తాం
D. లేదు!

6. ఒక వారంలో ఎన్నిసార్లు మీ భాగస్వామిని కలుస్తున్నారు?
A. వారానికోసారి
B. వారంలో రెండుసార్లు
C. వారంలో మూడుసార్లు
D. మొత్తం వారం

7. మీ పార్ట్ నర్ తో పిల్లల్ని కనాలని ఎప్పుడైనా అనుకున్నారా? 
A. అవును, చాలా మంది పిల్లలు
B. అవును, కానీ తక్కువ మంది పిల్లలు
C. అవును, కానీ ఒకే బిడ్డ
D. లేదు

8. ఏదైనా పాట వింటున్నప్పుడు మీకు మీ భాగస్వామి గుర్తుకొస్తారా? 
A. అవును, ముఖ్యంగా నెమ్మదిగా సాగే సంగీతం విన్నప్పుడు
B. అవును, వారికి ఇష్టమైన పాటలు విన్నప్పుడు
C. కాదు, నేనెంత ఎమోషనల్ కాదు
D. లేదు, అస్సలు ఛాన్సే లేదు

9. మీ భాగస్వామి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని కాపాడేందుకు మీరు ఎంతకైనా వెనుకాడరు? 
A. అవును, తప్పకుండా 
B. దాని గురించి ఆలోచిస్తారు
C. భయపడి వెనకడుగు వేస్తారు
D. లేదు, ఇతరులను సాయం కోసం అర్థిస్తారు

10. ఒకరోజులో మీ భాగస్వామి గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తారు?
A. ఎల్లప్పుడూ
B. అంతగా ఆలోచించరు
C. వారి గురించి అంత గమనికతో ఉండరు
D. ఒక్కసారైనా వారి ఆలోచన రాదు