
చివరి క్షణంలో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీనికి పరిమిత టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది రైలు బయలుదేరడానికి ముందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏసీ స్లాట్ బుకింగ్ కోసం రైల్వే ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, 11 గంటలకు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
Irctc తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేయాలి..?
1: IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ను ఓపెన్ చేయండి.
2: యూజర్ ఐడి, పాస్‌వర్డ్, క్యాప్చాతో లాగిన్ అవ్వండి.
3: “బుక్ టికెట్” పై క్లిక్ చేయండి
4: ప్రయాణ వివరాలు, కోటాను ఫిల్ చేయండి
5: రైలు, క్లాస్ ను ఎంచుకోండి
6: కొత్త పేజీకై “ప్రాసెస్” పై క్లిక్ చేయండి
7: ప్రయాణీకుల వివరాలను నమోదు చేయండి
8: చెల్లింపుతో కొనసాగండి. ఆ తర్వాత, కన్ఫర్మ్డ్ సీట్లు కేటాయించబడతాయి