అబార్షన్ చేయించుకుందని భార్యను చంపిన భర్త

V6 Velugu Posted on Sep 27, 2021

  • సనత్ నగర్ పరిధిలో దారుణం

హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో నవవధువు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి భార్యతో గొడవపడి గొంతు నులిమి చంపేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మానస(24) జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ (32)తో గత సంవత్సరం నవంబర్ లో వివాహం జరిగింది. పెళ్లయి రెండు నెలలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మానస తన పుట్టింటికి చేరుకుంది. అయితే పది రోజుల క్రితం భర్త గంగాధర్ తండ్రి చనిపోయాడని తెలిసి భర్త ఇంటికి వచ్చింది. నిన్న అర్ధరాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. తనకు తెలియకుండా ప్రెగ్నెన్సీ తీయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భార్య మానస గొంతు నులిపేశాడు. ఊపిరాడక విలవిలలాడిన మానస క్షణాల్లో కళ్లుతేలేసి తుదిశ్వాస విడిచింది. ఇవాళ ఉదయమే స్థానికుల ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం..

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

భారత్‌ బంద్‌లో విషాదం.. నిరసనల్లో రైతు మృతి

వీడియో: క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్

Tagged Hyderabad, NIzamabad, sanathnagar, bharathnagar, , husband killed wife, manasa(24), gangadhar (32), jagathgirigutta

Latest Videos

Subscribe Now

More News