రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. పోలీసుల సూచనలు

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. పోలీసుల సూచనలు

గులాబ్ తుఫాన్‌ కారణంగా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలో 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు ఉండే ప్రాంతాల్లో అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజరీని జారీ చేసింది. కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు.

ఆ సూచనలివే..

  • భారీ వర్షాలు కురుస్తుండడంతో అవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
  • వర్షంలో బైకులు నడపకండి.
  • చిన్నపిల్లలను రోడ్లపై ఆడుకోవడానికి అనుమతించకండి.
  • పిల్లలకు, మైనర్లకు బండి ఇవ్వకండి.
  • సైబరాబాద్ పరిధిలో ఏవైనా ట్రాఫిక్ సంబంధిత సమాచారం, సూచనల కోసం కంట్రోల్ రూమ్‌ నంబర్‌‌ 8500411111కు ఫోన్ చేయండి. సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో అవ్వండి.
  • వర్షానికి సంబంధించిన ఏవైనా సమస్యలపై సాయం కోసం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌ 040 21111111కు డయల్ చేయండి.
  • డీఆర్‌‌ఎఫ్​ నంబర్ – 040 29555500
  • ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్‌ – 9440813750

మరిన్ని వార్తల కోసం..

ఎయిర్‌‌పోర్టులోకి భారీగా వర్షపు నీరు

వర్షం ప్రభావం: ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా