తుఫాన్ ఎఫెక్ట్: ఎయిర్‌‌పోర్టులోకి భారీగా వర్షపు నీరు

తుఫాన్ ఎఫెక్ట్: ఎయిర్‌‌పోర్టులోకి భారీగా వర్షపు నీరు

గులాబ్ తుఫాన్‌ ఏపీని వణికిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రత కాస్త తగ్గినా వర్షం తగ్గడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. సహాయ కబృందాలు చెట్లను తొలగించి రోడ్లు క్లియర్ చేశాయి. 

వైజాగ్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి పూర్తిగా నీట మునిగింది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. అలాగే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టులోకి భారీగా వర్షపు నీరు చేరింది. విమానాశ్రయంలోకి ఎంటర్ అయ్యే ప్రాంతంతో పాటు లోపలికి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తల కోసం..

 

హుస్సేన్‌ సాగర్ గేట్లు ఓపెన్.. లోతట్టు ప్రాంతాలకు అలెర్ట్

ఎడతెరిపిలేని వర్షాలు: తెలంగాణలో 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

ఆస్తులమ్ముకున్నా ఫర్వాలేదు.. కేసీఆర్‎తో కొట్లాడమని నా భార్య చెప్పింది