హమాస్ కమాండర్ ఇంకొకరు హతం

హమాస్ కమాండర్ ఇంకొకరు హతం

జెరూసలెం: ఇజ్రాయెల్ పై దాడులు, కిబుజ్ లో ఊచకోత వెనక కీలక పాత్ర పోషించిన మరో హమాస్ టాప్ కమాండర్​ను హతమార్చామని ఐడీఎఫ్ ఆదివారం ప్రకటించింది. గాజాలోని ఓ బిల్డింగ్​లో ఉన్న హమాస్ మిలిటరీ వింగ్ నుఖ్బా ఫోర్స్ కు చెందిన నేవల్ ఫోర్స్ టాప్ కమాండర్ బిలాల్ అల్ కేద్రాను శనివారం రాత్రి బాంబుదాడి చేసి చంపేశామని వెల్లడించింది. 

కాగా, ఖతార్​లో ఆశ్రయం పొందుతున్న హమాస్ పొలిట్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ ఆదివారం ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. పాలస్తీనా విషయంలో సహకారంపై చర్చలు జరిపారు. మరోవైపు గాజాలో గ్రౌండ్ అటాక్ ప్రారంభిస్తే ఇజ్రాయెల్​లో భూకంపం తప్పదంటూ ఇరాన్ హెచ్చరించింది. 

కాగా, ఇజ్రాయెల్ లోని షుత్లాపై మిసైల్ అటాక్ చేసింది తామేనని లెబనాన్ లోని హిజ్బొల్లా టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించింది. ఉత్తరం వైపు నుంచి హమాస్​కు మద్దతుగా హిజ్బొల్లా చేస్తున్న దాడులకు ఐడీఎఫ్ ప్రతిదాడులు చేస్తోంది.