తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు వీరే

లోక్సభ ఎన్నికల్లో 14  ఎంపీ మెజార్టీ స్థానాల్లో  గెలుపే లక్ష్యంగా  కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే  13 స్థానాలకు  అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..  17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను కూడా  నియమించింది. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.  కాంగ్రెస్ ఇంకా వరంగల్,  కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  

  • ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, 
  • నల్గొండ- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
  • కరీంనగర్‌- పొన్నం ప్రభాకర్, 
  • పెద్దపల్లి- శ్రీధర్‌బాబు
  • వరంగల్‌- రేవూరి ప్రకాష్‌రెడ్డి,
  • మహబూబాబాద్‌- తుమ్మల నాగేశ్వరరావు,
  • హైదరాబాద్‌- ఒబెదుల్లా కొత్వాల్‌,
  • సికింద్రాబాద్‌- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,
  • భువనగిరి- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.
  • ఆదిలాబాద్-  సీతక్క
  • జహీరాబాద్- దామోదర్ రాజనర్సింహ
  • నిజామాబాద్- సుదర్శన్ రెడ్డి
  • మెదక్-కొండా సురేఖ
  • నాగర్‌కర్నూల్‌-జూపల్లి
  • మహబూబ్‌నగర్‌-సంపత్‌
  • చేవెళ్ల- వేం నరేందర్‌ రెడ్డి
  • మల్కాజ్‌గిరి- మైనంపల్లి హనుమంతరావు 

  • Beta
Beta feature
  • Beta
Beta feature