బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

మేడిపల్లి, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. మేడిపల్లి పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బంధువుల వద్ద ఉంటున్న బాలిక(15) స్థానిక స్కూల్​లో 8వ తరగతి చదువుతోంది. అదే ఏరియాలో ఉండే కేశవరెడ్డి(36) సోమవారం బాలికపై లైంగికదాడి చేశాడు.

కొద్దిసేపటి తర్వాత బాలిక తన కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో యాక్ట్​కింద కేసు నమోదు చేశారు. బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అత్యాచారానికి పాల్పడిన కేశవరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.