సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ ఓడి మొదట బౌలింగ్ చేస్తుంది. శుక్రవారం (నవంబర్ 14) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తుది జట్టులో స్థానం సంపాదించారు. నలుగురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కూడా భారత జట్టులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ కొత్త బంతిని పంచుకోనున్నారు. ప్రస్తుతం భారత జట్టు స్పిన్నర్లతో పాటు ఆల్ రౌండర్లతో నిండిపోయింది. 8 వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది.
మరోవైపు ఆరుగురు నిఖార్సైన బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టుకు టీమిండియా బౌలింగ్ లైనప్ పెద్ద సవాలుగా మారనుంది. స్పెషలిస్ట్ బ్యాటర్ సాయి సుదర్శన్ పై వేటు పడింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన పంత్ తిరిగి టీమిండియా ప్లేయింగ్ లో సుదర్శన్ స్థానంలో ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ జట్టులో స్థానం నిలుపుకున్నాడు కు జట్టులో స్థానం దక్కింది. మూడో స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే వాషింగ్ టన్ సుందర్ కు మూడో స్థానంలో ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడుతుంది. పాకిస్థాన్ సిరీస్ అద్భుతంగా రాణించిన సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్ ప్లేయింగ్ 11 లో ఉన్నారు. మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ ఫాస్ట్ బౌలర్లుగా బరిలోకి దిగారు. తొలి రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్ది రివర్స్ స్వింగ్ ప్రభావం ఉంటుంది. వికెట్‌పై గడ్డి తక్కువగా ఉన్నా.. ఎండిపోవడం లేదా పగుళ్లు ఏర్పడే చాన్స్ లేదు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేస్తే ఇండియాకు కష్టాలు తప్పేలా లేవు.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):
ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
ఇండియా (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
