
‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి టర్కీ, చైనా వంత పాడుతున్నాయి. చైనా, టర్కీ మీడియా సంస్థలు, ఈ రెండు దేశాలకు చెందిన కొన్ని ‘ఎక్స్’ అకౌంట్లు అదే పనిగా పాక్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. అలాంటి ‘ఎక్స్’ అకౌంట్లపై భారత్ కొరడా ఝుళిపించింది. అందులో భాగంగానే.. చైనా, టర్కీకి చెందిన కొన్ని ‘ఎక్స్’ అకౌంట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.
టర్కీ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ టీఆర్టీ వరల్డ్ (TRT World) ‘X’ అకౌంట్ను ఇండియా బుధవారం బ్లాక్ చేసింది. ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు రేగిన సమయంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతుగా నిలిచింది. టర్కీ తమ దేశం నుంచి పాకిస్తాన్కు డ్రోన్లు సప్లై చేసింది. ఆ డ్రోన్లను వాడుకున్న పాకిస్తాన్ భారత ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసి భారత సైనికులపై, పౌరులపై బాంబులేసే ప్రయత్నం చేసింది. ఇండియా పాక్ డ్రోన్లను తిప్పి కొట్టడంతో ప్రమాదం తప్పింది. ఇలా.. భారత్కు టర్కీ పరోక్షంగా ద్రోహం చేసింది.
The 'X' account of Turkish broadcaster 'TRT World' withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025
దీంతో.. టర్కీ ‘ఎక్స్’ అకౌంట్లపై భారత్లో ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటే టర్కీ, చైనా నిస్సిగ్గుగా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ మొదలుపెట్టి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తే.. భారత్కు వ్యతిరేకంగా చైనా, టర్కీ పనిచేశాయి. దీంతో.. ఆగ్రహించిన భారత్ ఇప్పటికే కొన్ని చైనా మీడియా ‘ఎక్స్’ అకౌంట్లను భారత్లో నిషేధించింది.
‘బాయ్ కాట్ టర్కీ’ ప్రస్తుతం ఇండియాలో ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. టర్కీ ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్ పెద్ద ఎత్తున తెరపైకొచ్చింది. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ఆ దేశం విలవిలలాడిపోయింది. ఆ సమయంలో అన్ని ప్రపంచ దేశాల కంటే ముందు టర్కీకి సాయం చేసిన దేశం భారత్.
ఆ కనీస కృతజ్ఞత కూడా లేకుండా భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉంటే పాకిస్తాన్కు టర్కీ మద్దతు తెలపడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దేశానికి సాయం చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే టర్కీ యాపిల్స్ను భారత్లోని పండ్ల వ్యాపారులు తిప్పి పంపించేస్తున్నారు. తమకు దేశం కంటే డబ్బు ముఖ్యం కాదని పండ్ల వ్యాపారులు దేశ భక్తిని చాటుకుంటున్నారు.